1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 11 మే 2022 (23:03 IST)

ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే బ్రోంకటిస్ సమస్య, కారణం ఏంటి?

బ్రోంకటిస్ అనేది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్ళే వాయుమార్గాల వాపు వల్ల తలెత్తుతుంది. ఇది తరచుగా శ్లేష్మం తెచ్చే దగ్గుకు కారణమవుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలోపం, తక్కువ జ్వరం, ఛాతీ బిగుతుగా అనిపిస్తుంది. బ్రోంకటిస్ తీవ్రమైనదిగానూ దీర్ఘకాలికమైనదిగాను వుంటుంది.

 
తీవ్రమైన బ్రోంకటిస్ చాలా సందర్భాలలో చాలా రోజుల తర్వాత తగ్గుతుంది. కానీ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత దగ్గు చాలా వారాల పాటు ఉంటుంది. జలుబు- ఫ్లూకి కారణమయ్యే వైరస్‌లే తరచుగా తీవ్రమైన బ్రోంకటిస్‌కు కారణమవుతాయి. ఈ వైరస్‌లు ఎవరైనా దగ్గినప్పుడు లేదా భౌతికంగా వారిని తాకినప్పుడు, సమీపంలో వుంటే గాలి ద్వారా వ్యాపిస్తాయి. పొగాకు పొగ, వాయు కాలుష్యం, దుమ్ము, ఆవిరి, పొగలకు గురికావడం కూడా తీవ్రమైన బ్రోంకటిస్‌కు కారణం కావచ్చు. బ్యాక్టీరియా కూడా తీవ్రమైన బ్రోంటిస్‌కు కారణమవుతుంది.

 
బ్రోంకటిస్ చికిత్సలలో విశ్రాంతి తీసుకోవడంతో పాటు అవసరమైన లిక్విడ్స్ ఇస్తారు. తగిన మందులు కూడా సిఫార్సు చేస్తారు వైద్యులు. మరీ ఊపిరి ఆడకుండా పిల్లికూతలు ఎక్కువైతే శ్వాసించే వాయుమార్గాలను తెరవడానికి పీల్చే ఔషధం అవసరం కావచ్చు.