శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 16 మే 2017 (01:56 IST)

మధుమేహం నియంత్రణలో ఆ ఏడు తప్పులను అధిగమించడం ఎలా?

మీరు మధుమేహాన్ని అదుపు చేసే పథకాన్ని ఈ మధ్యనే అమలులో పెట్టారా? లేక చాలా కాలం నుంచి స్వీయ రక్షణ పద్ధతులను అవలంబిస్తున్నారా.. ఏదైనా కావచ్చు కానీ మధుమేహాన్ని నింయంత్రించడానికి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు సాధారణంగా మీరు చేసే కొన్ని తప్పులను గమనించాలి. వాట

మీరు మధుమేహాన్ని అదుపు చేసే పథకాన్ని ఈ మధ్యనే అమలులో పెట్టారా? లేక చాలా కాలం నుంచి స్వీయ రక్షణ పద్ధతులను అవలంబిస్తున్నారా.. ఏదైనా కావచ్చు కానీ మధుమేహాన్ని నింయంత్రించడానికి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు సాధారణంగా మీరు చేసే కొన్ని తప్పులను గమనించాలి. వాటిని అధిగమిస్తేనే డయాబెటిస్ నియంత్రణపై మీరు సరైన దారిలో నడుస్తున్నట్లు లెక్క.
 
1. మీకు మధుమేహం ఉన్నప్పుడు మీరు, మీ డాక్టర్ కలిసి పనిచేయవలసిన అవసరముంది. మీ రక్తంలో సుగర్ నిల్వల స్థాయిని మీ డాక్టర్ నిత్యం తెలుసుకోవలసి ఉంది. అప్పుడే మీకు ఉత్తమ చికిత్స దొరికే అవకాశం ఉంటుంది.
 
2. మధుమేహం గురించి మీరు చదువుతున్న ప్రతి సమాచారం విశ్వసనీయమైనది కాకపోవచ్చు. కచ్చితమైన ఆధారాలనుంచే మీరు ఆ సమాచారాన్ని స్వీకరించాలి. ఇంటర్నెట్‌లో మీరు చదివేదంతా నిజం కాకపోవచ్చు.
 
3. మధుమేహ నివారణకు ఒక పద్దతిని లేదా చికిత్సా విధానాన్ని ఎంచుకుని మీ లక్ష్యాన్ని చిన్న చిన్న దశల గుండా దాటడానికి ప్రయత్నించండి. ఒక్క రాత్రిలో, లేదా కొద్ది రోజుల్లో ఇలాంటి మొండి వ్యాధులు తగ్గుముఖం పట్టవని గ్రహించాలి.
 
4. మీకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదిలిపెట్టవలసిన అవసరం లేదు. మీకిష్టమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా స్వీకరించండి. 
 
5. మధుమేహ నియంత్రణలో మీరు విఫలమయ్యారా? ఏం ఫర్వాలేదు. ఆ విషయాన్ని అంగీకరించండి. దాన్నుంచి నేర్చుకోండి. అంతే తప్ప రోజంతా మూడ్ పాడు చేసుకోవాల్సిన పనిలేదు. మీ పట్ల మీరు తీసుకునే జాగ్రత్తే దానికదిగా మీకు విజయం సాధించి పెడుతుంది.
 
6. మీ శరీరమే మీ మార్గదర్శిని, కానీ మీ రక్తంలో గ్లూకోజ్ పరిమితి మించిన విషయాన్ని ఎల్లప్పుడూ మీ శరీరం సూచించకపోవచ్చు. మీ రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తెలుసుకుని తగిన చర్య తీసుకోవడానికి ఆక్యు-చెక్ వంటి బ్లడ్ గ్లూకోస్ మీటర్ సరైన, విశ్వసనీయమైన మార్గం.
 
7. మధుమేహ నిర్వహణ, నివారణ అనేది సుదీర్ఘ ప్రక్రియ. మీ డాక్టర్, మీ కుటుంబం, ఇతరులు మీకు సహాయపడవచ్చు. కాని అంతిమంగా దాన్ని నివారించుకోవలసింది మీరే. ఆ బాధ్యతను మీరే చేపట్టాలి.
 
చివరిగా.. మధుమేహ నిర్వహణ, నివారణ అనేది సుదీర్ఘ ప్రక్రియ. ఆ దిశగా మీరు చేపట్టే ప్రతి చర్యా మీ లక్ష్యం వైపు మిమ్మల్ని ప్రయాణింప చేస్తుంది. కానీ ప్రతి రోజూ ఒకే సమయంలో పరీక్ష చేసుకోండి, మీ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిని మీరే చెక్ చేసుకుంటూ మీరు గమనించిన అంశాలను మీ డాక్టర్‌తో చర్చిస్తుంటే మధుమేహం మీ నియంత్రణలోనే ఉంటుంది.