మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (16:20 IST)

గోధుమ పదార్థాలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

గోధుమను డైట్‌లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. గోధుమలో మినరల్స్ అధికంగా ఉంటాయి. గోధుమ తీసుకుంటే ఒబిసిటీ, డయాబెటిస్, గ్యాస్టిక్, క్యాన్సర్, పిల్లలకు ఆస్తమా వంటి రోగాలను అరికడుతుంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గోధుమతో కేక్, బ్రెడ్, చపాతీ, పూరీ వంటివి తయారుచేస్తారు. గోధుమలో విటమిన్ బి1, బి2, బి3, కాపర్, క్యాల్షియం, జింక్, ఫైబర్, ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి.
 
ఒబిసిటీ, అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారు.. రోజులో ఒక్క పూటైనా గోధుమతో చేసిన ఆహారాలు తీసుకుంటే.. ఈ వ్యాధులను తగ్గించవచ్చును. గోధుమ శరీర మెటబాలిజానికి చాలా ఉపయోగపడుతుంది. కొందరైతే గోధుమతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే.. అజీర్తిగా ఉంటుందని చెప్తుంటారు. కానీ, అది నిజం కాదు.. గోధుమలోని ఫైబర్ అజీర్తి నుండి వెంటనే ఉపశమనం కలిగేలా చేస్తుంది. 
 
రక్తపోటును అదుపు చేస్తుంది. శరీరంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటే మధుమేహం వచ్చే అవకాశం చాలా దగ్గరగా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ వ్యాధిని అరికట్టాలంటే.. గోధుమ తీసుకోవాలి. ఇటీవలే ఓ పరిశోధనలో గోధుమ తీసుకోని కొందమందిని టెస్ట్ చేసి చూస్తే.. వారిలో చాలామంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి కూడా అధికంగా ఉంది. ఎన్ని మందులు, మాత్రలు వాడినా ఎలాంటి ప్రయోజనం లేదని వెల్లడించారు.
 
మరి అందుకు ఏం చేయాలని వారు అడిగేతే.. గోధుమ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పిన మాట ప్రకారమే వారందరు గోధుమలు తరచు తీసుకుంటున్నారు. మళ్లీ కొన్ని రోజుల తరువాత చికిత్స చేయించుకోవడానికి వచ్చారు. అప్పుడు చూస్తే.. వారి వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని తెలియజేశారు. అందువలన గోధుమను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదిలేకండి..