శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 2 మే 2018 (12:23 IST)

చంటిపిల్లలకు చెంచా యాపిల్ జ్యూస్ తాగిస్తే?

ఆపిల్‌ను రోజుకొకటి తీసుకుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సి వుండదని వైద్యులు చెప్తారు. ఆపిల్ పండ్లలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా వుంటాయి. యాపిల్ రక్తక్షీణతను నివారిస్తుంది. రక్తహీనత కలిగిన వారు రోజుకు

ఆపిల్‌ను రోజుకొకటి తీసుకుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సి వుండదని వైద్యులు చెప్తారు. ఆపిల్ పండ్లలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా వుంటాయి. యాపిల్ రక్తక్షీణతను నివారిస్తుంది. రక్తహీనత కలిగిన వారు రోజుకు మూడు యాపిల్స్ తింటే మంచిది. అలా కాకుంటే యాపిల్ జ్యూస్‌ను తీసిన వెంటనే తాగాలి.
 
చంటిపిల్లలకు విరేచనాలవుతున్నపుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరికడతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనె కూడా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్‌ట్రబుల్, పుల్లని తేనుపులు, గుండెల్లో మంటను నివారిస్తాయి.
 
మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని, చిత్రకాదివటి అనే ఆయుర్వేద మాత్ర వేసుకుని మజ్జిగ తాగితే పుల్లటి త్రేనుపులు, పొట్ట ఉబ్బరం, పైత్యాన్ని నివారిస్తుంది. ధనియాలు, జీలకర్రను విడివిడిగా నేతిలే వేయించి, కొంచెం ఉప్పు కలిపి వీటిని పొడిచేసి గ్లాసు మజ్జిగలో కలుపుకుని చిత్రకాదివటి మాత్రను వేసుకుని మజ్జిగను త్రాగుతుంటే ఉదర రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.