సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (23:10 IST)

వీటిలో తక్కువ క్యాలరీలు, తక్కువ కొవ్వు... ఫైబర్ కూడా...

అలసందల్లో తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ ఉంటుంది. బరువు తగ్గించడంలో మంచి ఆహారంగా సహాయపడుతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. వీటిని తినడం వల్ల మీకు పొట్టనిండిన అనుభూతి కలుగుతుంది. అదనపు ఆహారం జోలికి వెళ్లరు. 
 
మధుమేహంతో బాధపడే వారికి లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తుంది మరియు ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుండి తొలగిస్తుంది. 
 
రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడమే కాకుండా, హార్ట్ సంబంధిత వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం మరియు మెగ్నిషియం గుండె ఆరోగ్యానికి మంచిది. అలసందల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 
వీటిలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ వలన చర్మానికి హాని కలగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.