బరువు తగ్గాలనుకునేవారు.. నల్లద్రాక్షలు తినండి..
నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి వుంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. తరచూ నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వ
నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి వుంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. తరచూ నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఏకాగ్రత కుదరడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగు అవుతుంది. వీటిల్లో ప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్ మైగ్రెయిన్ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.
నల్లద్రాక్షల్లో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను దూరం చేస్తాయి. ఈ ద్రాక్షలోని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదని.. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి.. బరువు తగ్గించేందుకు ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.