సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 15 నవంబరు 2022 (22:49 IST)

భోజనం తర్వాత వెంటనే అరటిపండు తినవచ్చా?

చాలామంది భోజనం తర్వాత అరటిపండు తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటి పండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. 
 
రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదని గమనించండి. 
 
కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వండటం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని గమనించండి. ఇది హానికరం. ఇక పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగు గాని తింటే దీర్ఘకాల రోగాలు తప్పవు. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.