శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (15:09 IST)

పొద్దస్తమానం పొగ తాగుతున్నారా... పిల్లలకు ఆస్త్మా వస్తుందట..

పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం. అని మనందరికీ తెలిసినా కూడా నికోటిన్ ఆరోగ్యానికి చెడు కలిగిస్తుందని తెలిసినాకూడా చాలా మంది పొగ త్రాగడాన్ని... అలాంటి పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే.

పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం. అని మనందరికీ తెలిసినా కూడా నికోటిన్ ఆరోగ్యానికి చెడు కలిగిస్తుందని తెలిసినాకూడా చాలా మంది పొగ త్రాగడాన్ని... అలాంటి పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే. నిజానికి పొగత్రాగడం మగవారికి మాత్రమే కాదు వారి పిల్లలకు కూడా ప్రమాదమే. వారు పొగత్రాగడం వల్ల పిల్లలను ఆస్త్మాఆవహించే అవకాశాలు మూడు రేట్లు ఎక్కువగా ఉంటాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. 
 
పరిశోధకులు 24 వేలమందికి పైగా బాలలు, పొగత్రాగే అలవాటు ఉన్న వారి తండ్రుల వివరాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ళ వయస్సు కన్నా ముందు నుండే పొగత్రాగే అలవాటున్న మగవారి పిల్లలకు ఆస్త్మా ఆవహించే ప్రమాదం ఎక్కువగా కనిపించిందని నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుసీలై స్వాన్ వెల్లడించారు. 
 
తల్లులు, ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో పొగత్రాగినా పిల్లలకు ఆస్త్మా ఆవహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారంటున్నారు. అయితే గర్భం ధరించడానికి ముందు తల్లులు పొగ త్రాగినా పిల్లలపై ప్రభావం ఉండదని తేలింది. తండ్రులు పొగత్రాగితే వారి వీర్య కణాల ద్వారా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. స్మోకింగ్ పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపడమే కాకుండా వారిలో జన్యుపరమైన నష్టాలు కూడా కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు.