ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 7 నవంబరు 2019 (20:43 IST)

డయాబెటిస్, ఈ వ్యాధి వుంటే ఈ పదార్థాలతో బీకేర్‌ఫుల్

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర శాతాన్ని సమతూకంలో ఉంచుకోవాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మధుమేహంతో బాధపడేవారు ప్రోటీన్లు గల ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక ప్రోటీన్లు, అధిక కెలోరీలు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
 
వేపుళ్లు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైలను ముట్టుకోకపోవడం మంచిది. కోడిగుడ్డులో పసుపు సొన, చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమం. అయితే ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు. పీచు పదార్థాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఆరెంజ్, ఎండు ద్రాక్షలు, బార్లీ, పాప్ కార్న్, పప్పు ధాన్యాలు, బఠాణీలు వంటివి తీసుకోవచ్చు. 
 
ఇక కార్బొహైడ్రేట్లు నిండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ క్రమం అవుతుంది. కార్బొహైడ్రేడ్లు పప్పు దినుసులు, పండ్లు, కాయగూరల్లో పుష్కలంగా ఉంటాయి. బాదం, ఆలివ్ ఆయిల్, ఆక్రూట్ పండ్లు, చేపల్లో కొన్ని రకాలను తీసుకోవచ్చు.