సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 జనవరి 2024 (15:42 IST)

మంచినీటిని ఇలా తాగితే ఆరోగ్యం

drinking water
భోజనం వేళకి ఎలా తినాలో అలాగే మంచినీటిని కూడా ఒక క్రమపద్ధతిలో తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మంచినీటిని ఎలా తాగాలో తెలుసుకుందాము. అంతర్గత అవయవాలు పనితీరు మెరుగుపడాలంటే ఉదయాన్నే 2 గ్లాసుల మంచినీరు తాగాలి.
దాహం వేస్తే, భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి
నీరు త్రాగేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగకూడదు. ఎప్పుడూ కొద్దికొద్దిగా నీరు త్రాగాలి.
 
ఆహారం తినే ముందు లేదా తిన్న తర్వాత వెంటనే ఎప్పుడూ నీరు త్రాగకూడదు.
ఇలా తాగితే ఆ నీరు గ్యాస్ట్రిక్ రసాలను పలుచన చేసి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
ఆహారం తీసుకునేటప్పుడు దాహం ఎక్కువగా అనిపిస్తే 1, 2 గుటకల నీరు మాత్రమే తాగాలి.
 
ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగాలి.
స్నానం చేసే ముందు గ్లాసు మంచినీరు తాగితే రక్తపోటు అదుపులో వుంటుంది.
రాత్రి వేళ పడుకునే ముందు గ్లాసు మంచినీరు తాగితే గుండెపోటు, గుండె సమస్యలను దూరం చేయవచ్చు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు చెపుతారు.