శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 జులై 2023 (23:25 IST)

ఎర్ర తోటకూర తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

red amaranth leaves
ఎర్ర తోటకూర. తోటకూరల్లో రకాలున్నాయి. వాటిలో ఎర్ర తోటకూర కూడా ఒకటి. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఈ ఎర్ర తోటకూరలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము.
ఎర్ర తోటకూర ఫైబర్‌కి మూలం. వీటి ఆకులు నుంచి కాండం వరకూ అన్నీ పోషకాలతో వుంటాయి.
ఎర్ర తోటకూర తింటుంటే పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది.
 
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎర్ర తోటకూర తింటే ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, అధిక రక్తపోటు అదుపునకు ఎర్ర తోటకూర తింటే మంచిది. ప్రమాదకర గొంతు క్యాన్సర్ వ్యాధి రాకుండా నిలువరించడంలో ఎర్ర తోటకూర దోహదపడుతుంది.
 
ఎముక పుష్టికి ఎర్ర తోటకూర ఎంతో మంచిది. సీజనల్‌గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఇది సాయపడుతుంది.