శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 25 జులై 2023 (22:56 IST)

బ్లాక్ గ్రేప్స్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

grapes
నల్ల ద్రాక్ష. ద్రాక్షలలో రెండుమూడు రకాలు వున్నప్పటికీ ద్రాక్ష వల్ల ప్రయోజనాలు దాదాపు ఒకేలా వుంటాయి. ఈ నల్ల ద్రాక్షతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తనాళాలలో రక్తసరఫరాను మెరుగుపరచడం ద్వారా నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నల్ల ద్రాక్షలో పుష్కలంగా వున్నాయి.
 
యాంటిఆక్సిడెంట్ గుణాలు వున్నందున క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నిరోధిస్తాయి.
ద్రాక్షలో రిబోఫ్లేవిన్ వున్నందున, మైగ్రేన్‌లతో బాధపడేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
నల్ల ద్రాక్ష ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరిచి మధుమేహం నివారణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
 
బ్లాక్ గ్రేప్ సీడ్ ఆయిల్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ తలపై రక్త ప్రసరణను మెరుగుపరచి కేశాలకు మేలు చేస్తాయి. నల్ల ద్రాక్షలో విటమిన్ సి, కె, ఎలతో పాటు ఫ్లేవనాయిడ్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.