బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 22 జులై 2023 (21:12 IST)

చినుకులతో పాటు వచ్చేసాయ్ మొక్కజొన్న కండెలు, తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. మొక్కజొన్న ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
 
మెుక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి వయసుపైబడినట్లు తెలియనీయవు. మెుక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది. మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో వుండే విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్‌గా, షైనింగ్‌గా ఉంటుంది.