సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 27 అక్టోబరు 2021 (23:38 IST)

బెల్లం తింటే ఆరోగ్య ఫలితాలు ఏమిటో తెలుసా?

శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. దగ్గు, జలుబును కూడా బెల్లం సులభంగా దూరం చేయగలదు. చక్కెర లాగా బెల్లం వలన దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఇంకా మంచిది. బెల్లంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. 
 
ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్న సమయంలో బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్లు బెల్లం తింటే మంచిది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బెల్లం తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.