పండు శరీర బరువును తగ్గిస్తుంది సరే ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
ఈమధ్య కాలంలో పండ్లు తినడం ఎక్కువైంది. బరువు తగ్గాలంటే పండ్లు తినడం ఒక్కటే మార్గమని చాలామంది వాటిని మాత్రమే తింటున్నారు. కొవ్వు శాతం తక్కువగా ఉండటం, చాలా పండ్లలో నీరు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కేలరీల పరిమాణం తక్కువగా వుంటుంది.
పండ్లు తీసుకుంటూ వుండటం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గడమే కాకుండా భోజన ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కొవ్వు కణాల ఉత్పత్తి తగ్గడంతో బరువు పెరగడం నియంత్రణలోకి వస్తుంది. పండ్లలో వుండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు కణాల నిర్మాణం కొవ్వు నిల్వను అణిచివేస్తాయి.
యాపిల్స్, బేరి పండ్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. వీటిలో 6% ఫ్రక్టోజ్, సగం కంటే తక్కువ సుక్రోజ్ ఉండటం గమనార్హం. కనుక పండ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా అడ్డుకోవచ్చు. ఐతే అదేపనిగా పండ్లను తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు ఇవి అనారోగ్యాలకు కూడా దారితీసే అవకాశం వుంటుందని అంటున్నారు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకోవడమే మేలు.