రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే ఆహారం, ఏంటవి?
గుండె జబ్బులను కలిగించేవి ఎక్కువగా కొవ్వు కలిగిన పదార్థాలే. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే దాని ప్రభావం గుండె పనితీరుపై పడుతుంది. అందువల్ల కొవ్వును తగ్గించే ఫైబర్ కలిగిన పదార్థాలను తినాలి. ఇలాంటి ఫైబర్ వున్న పదార్థాలు రెండు రకాలుగా వుంటాయి. కరిగే ఫైబర్, కరగని పీచు పదార్థాలు.
కరిగే ఫైబర్‌తో బ్లడ్ కొలెస్టిరాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇవి గ్లూకోజును తీసుకోవడంలో నెమ్మది చేయుటంతో రక్తములో షుగర్ లెవల్ తగ్గిపోతుంది. ఓట్స్, ఓట్స్ తవుడు, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు, పండ్లు, యాపిల్, ఆరెంజ్, కారెట్స్ వంటి కాయగూరలు.
ఇక కరగని పీచు పదార్ధము కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది. విరోచనము సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. ఇలాంటివి తొక్కతీయని ధాన్యాలు... అంటే పెసలు, ఉలవలు, మినుములు వంటివి.