శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (20:33 IST)

వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుంది? (video)

మంచినీళ్లు తాగటానికి కూడా కొన్ని సూత్రాలున్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే మంచినీళ్లు తాగితే సమస్యలు వస్తాయి. ఈ వానాకాలంలో చాలామంది వేరుశనగ పప్పు అంటే ఇష్టపడుతుంటారు. వేడివేడిగా వాటిని తినేస్తుంటారు. వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదంటారు. ఎందుకంటే వేరుశనగ పప్పులో నూనె అధిక శాతం ఉంటుంది. కాబట్టి వాటిని తిన్న వెంటనే నీటిని తాగితే అది వేరుశనగపప్పు నూనెతో ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
 
వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగొద్దు అనడానికి ఇంకో కారణం ఏంటంటే.. ఈ పప్పు సహజంగానే ఒంట్లో వేడిని కలిగించే లక్షణాన్ని కలిగి వున్నాయి. ఇలాంటప్పుడు వీటిని తిని మంచినీళ్లు తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి సెట్ కావు. కాబట్టి దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.
 
అంతేకాదు వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దాంతో గ్యాస్, అజీర్ణం సమస్య తలెత్తుతుంది. కాబట్టి వేరుశనగ పప్పు తిన్న తర్వాత కనీసం పావుగంట తర్వాత మంచినీళ్లు తాగితే మంచిది.