శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2022 (16:46 IST)

హెచ్ఐవి సత్వర నిర్ధారణ: అధునాతన 4వ తరం ర్యాపిడ్ టెస్ట్‌లతో అంతరాల తొలగింపు

aids patients
భారతదేశంలో సుమారుగా 23.5 లక్షల మంది ప్రజలు హెచ్ఐవి (పిఎల్ హెచ్ఐవి)తో ఉండగా, 17.8 లక్షల మంది మాత్రమే తమ స్థితి గురించిన అవగాహన కలిగి ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను పొందేందుకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెచ్ఐవి టెస్టింగ్‌తో పొందిన ప్రయోజనాలకు కూడా ముప్పు ఎదురైంది. యూఎన్ ఎయిడ్స్ ఆశయం మొత్తం హెచ్ఐవి పాజిటివ్ రోగుల్లో 95% మందిని పరీక్షించడం. అది రోగనిర్ధారణ అయిన వారు ప్రభావపూరిత చికిత్స పొందేందుకు, తద్వారా 2030 నాటికి నూతన హెచ్ఐవి ఇన్ఫెక్షన్లకు ముగింపు పలికేందుకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ లక్ష్యసాధనకు, దేశంలో ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కోవ డం అనే ఆశయాన్ని సాధించేందుకూ భారతదేశపు టెస్టింగ్ అంతరాన్ని భర్తీ చేయడం అనేది కీలకంగా మా రింది.
 
ఈ సందర్భంగా హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌ (ముంబై) కన్సల్టెంట్, యునిసన్ మెడికేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ముంబై, ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా మాట్లాడుతూ, “దేశవ్యా ప్తంగా హెచ్‌ఐవి భారం గణనీయంగా ఉంది. హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తులుగా భావిస్తున్న వారిలో 79.4 శాతం మందికి మాత్రమే టెస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వారికి రోగనిర్ధారణ పరిష్కారాల లభ్యతకు గల అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన నియంత్రణ ప్రక్రియల క్రింద వేగవంతమైన పాయింట్-ఆఫ్-కేర్ పరీక్షలు వంటి సాధారణ, స్కేలబుల్  హెచ్ఐవి టెస్టింగ్ విధానా లను ఉపయోగించడం ద్వారా  అటువంటి అంతరాలను పూరించవచ్చు. ప్రత్యేకించి వ్యక్తులకు అధిక వైరల్ కారణంగా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ముందస్తు పరీక్ష చేయడం, ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడం ఎంతో ముఖ్యమైంది. ఇది సకాలంలో చికిత్సను సులభతరం చేస్తుంది, మెరుగైన ఫలితాలకు తోడ్పడుతుంది, అదే సమయంలో సంక్రమణ వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు’’ అని అన్నారు.
 
సత్వరమే, కచ్చితత్వంతో హెచ్ఐవి పాజిటివ్ రోగులను గుర్తించడం అనేది, ఆయా రోగులు తమకు అవసర మైన చికిత్స, సంరక్షణను సాధ్యమైనంత తొందరగా పొందేందుకు వీలు కల్పిస్తుంది. అంతేగాకుండా, తమ ఇన్ఫెక్షన్, ఆ వైరస్ 3.5 రెట్లు సంక్రమింపజేస్తుందని తెలియని వ్యక్తుల నుంచి హెచ్ఐవి మరింతగా వ్యాపించకుండా కూడా తోడ్పడుతుంది. రోగుల మరణాల అవకాశాలను కూడా అది తగ్గిస్తుంది.
 
ప్రొఫెషనల్స్‌చే క్లినికల్ సెట్టింగ్స్‌లో నిర్వహించబడే ర్యాపిడ్ హెచ్ఐవి స్క్రీనింగ్ వంటి వాటికి సంబంధించిన పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ వంటి వినూత్నతలు సకాలంలో ఇన్ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఎంతో ముఖ్యం. 20 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితం తెలియడం వల్ల అది డయాగ్నస్టిక్స్ కు యాక్సెస్ ను మెరుగు పరు స్తుంది. తమ ఇన్ఫెక్షన్ స్థాయి తెలుసుకోవడంలో ప్రజలకు సాధికారికత కల్పిస్తుంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టు చేయించుకోవడం తక్కువగా ఉండే, దేశ మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలకు యాక్సెస్ తక్కువగా ఉండే భారతదేశం వంటి దేశాల్లో ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ పరిష్కారాలు మరెంతో ముఖ్యమైనవి.
 
సాక్ష్యాధారాలతో కూడిన 4వ తరం సాంకేతిక ఆధారిత ర్యాపిడ్ టెస్ట్ లతో నేడు పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ ప్రమాణాలు నిరంతరం వృద్ధి చెందుతూ ఉన్నాయి. గత తరాలకు చెందిన 2వ, 3వ తరాల టెస్టుల కంటే అవి సమున్నతంగా ఉంటున్నాయి. ఈ నూతన టెస్టులను ఉపయోగించడం ఎంతో సులభం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న3వ తరం ర్యాపిడ్ టెస్టులలో గుర్తించలేని 28% ఇన్ఫెక్షన్లను కూడా అవి గుర్తించగలుగుతాయి. తద్వారా మరెంతోమంది తమ ఇన్ఫెక్షన్ల స్థాయి గురించి తెలుసుకోగలుగుతారు. తద్వారా తమ ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు అవసరమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను వారు వేగంగా పొందగలుగుతారు. హెచ్ఐవీ యాంటీబాడీలతో పాటుగా, ఇన్ఫెక్షన్ సోకిన 15-25 రోజుల తరువాత కనిపించే యాంటీజెన్ రెండింటినీ గుర్తించగలిగే సామర్థ్యంతో ఈ టెస్టులు సత్వర నిర్ధారణకు వీలు కల్పిస్తాయి. తద్వారా తక్కువ సమయంలోనే మరింత కచ్చితమైన ఫలితాలను ఇవి అందిస్తాయి. హెచ్ఐవి డిటెక్షన్ విండో పీరియడ్‌ను సగానికి తగ్గినందున బ్లడ్ బ్యాంక్ స్క్రీనింగ్‌లకు కూడా ఇదెంతో ముఖ్యమైంది.
 
భారతదేశంలో అబాట్ ర్యాపిడ్ డయాగ్నస్టిక్స్ బిజినెస్ జనరల్ మేనేజర్ సునీల్ మెహ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఇన్ఫెక్షన్ క్లిష్టమైన దశ వద్ద వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలను నిర్ధారించేలా, పాయింట్ ఆఫ్ కేర్ (ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు) వద్ద వ్యక్తులకు హెచ్ఐవి డయాగ్నస్టిక్ సొల్యూషన్స్ లభ్యతను అధికం చేసేందుకు అబాట్ కట్టుబడి ఉంది. 4వ తరం పాయింట్-ఆఫ్-కేర్ టెస్టింగ్ కొత్త ప్రామాణిక టెస్టింగ్‌ను ప్రతిబింబిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. ఇది హెచ్ఐవి పాజిటివ్ కేసులను ముందుగా గుర్తించడానికి సహాయపడుతుంది. వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పటికీ గుర్తించడం ద్వారా, రోగుల సంరక్షణలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. భారతదేశంలో, హెచ్ఐవి భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి మేం ఈ నూతన తరం సాధనాలతో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలకు అండగా నిలుస్తున్నాం’’ అని అన్నారు.
 
4వ తరం టెస్టింగ్, అధిక సున్నితత్వం, నిర్దిష్టతతో ఉంటూ, మరింత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌లను కూడా గుర్తిస్తుంది. ఈ విధమైన ఇన్ఫెక్షన్లు మునుపటి తరం పరీక్షలతో పోలిస్తే, పరీక్షలను కోరుకునే వ్యక్తులలో 5 నుండి 20% HIV ఇన్‌ఫెక్షన్‌ వరకూ ఉంటాయి. 3వ తరం పరీక్షల ద్వారా గుర్తించబడిన సాధారణంగా 20 రోజులు లేదా తరువాతి కాల వ్యవధితో గుర్తించడంతో పోలిస్తే, ఇంకా త్వరగానే అంటే, HIV సంక్రమణతో జీవించిన 12 రోజులలోనే గుర్తించే విండో వ్యవధిని తగ్గించివేయడంలో సహాయపడుతుంది.
 
దీంతో, HIV-పాజిటివ్ రోగులను త్వరగా గుర్తించవచ్చు, సంరక్షణకు అనుసంధానించవచ్చు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే గొలుసు కూడా తెగిపోతుంది. ఈ చెయిన్ తెగిపోవడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు అధిక వైరల్ లోడ్ ఒకరి నుంచి ఒకరికి అంటుకునే ప్రమాదంతో సంబంధం కలిగి ఉంటాయి. టెస్టింగ్‌లో వినూత్నతత అనేది జాతీయ HIV భారాన్ని తగ్గించడానికి, ముందస్తు, సరైన చికిత్సను పొంద డం ద్వారా రోగి ఫలితాలను మెరుగుపరచడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి కీలకమైనది.