మంగళవారం, 16 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (19:43 IST)

పొట్ట దగ్గర కొవ్వుకు బై బై చెప్పే గుమ్మడి కాయ

పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కూరగాయలు తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుందో ఓసారి చూద్దామా.. మన శరీరంలోని ఉన్న కొవ్వును తగ్గించుకోవాలి అంటే ముందుగా మనం గుమ్మడి కాయ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. 
 
గుమ్మడికాయని కేవలం ఒక తీపి పదార్థంలా కాకుండా ఒక కూరగాయల మాత్రమే దీనిని ఉపయోగిస్తే శరీరం బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మిరపకాయలను తింటే కారం అవుతుందని మన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వీటిని తినడం వల్ల మన శరీరంలో కొవ్వు కరుగుతుంది అని చాలా మందికి తెలియదు. వీటిని తినడం ద్వారా శరీరంలో కాస్తా ఉష్ణోగ్రత పెరగడం ద్వారా శరీరంలో ఉండే వేడికి కొవ్వు కరుగుతుంది.
 
వీటితోపాటు వారానికి రెండు లేదా మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాదు, అధిక బరువు సమస్యను కూడా చాలావరకు తగ్గించవచ్చు. దీనికి కారణం పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజం ను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. వీటితో పాటు కాలీఫ్లవర్, క్యాబేజీ లను తీసుకోవడం ద్వారా శరీరంలో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 
 
వీటివల్ల మనకు అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు ఆకుపచ్చని కూరగాయలు, అలాగే ఆకుకూరలు ఏవైనా సరే ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా మీ శరీరంలో కొవ్వు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరను ఉపయోగిస్తే మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.