మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (15:26 IST)

సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారమా?

పుట్టుక.. మరణం.. పుట్టిన ప్రతి వాడు గిట్టక మానడు.. అనేది అందరికీ తెలిసిందే. మానవ జీవితం ఒక అద్భుతమని.. ఈ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి. కానీ, సమస్యలు.. ఆర్థిక ఇబ్బందులు.. ఇతరత్రా కారణాలతో నిండు జ

పుట్టుక.. మరణం.. పుట్టిన ప్రతి వాడు గిట్టక మానడు.. అనేది అందరికీ తెలిసిందే. మానవ జీవితం ఒక అద్భుతమని.. ఈ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి. కానీ, సమస్యలు.. ఆర్థిక ఇబ్బందులు.. ఇతరత్రా కారణాలతో నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. జీవితంలో కష్టాలకు.. సమస్యలకు ఎదురీతకుండా 'చావు' ఒక్కటే పరిష్కారమనుకుంటున్నారు. కష్టాలు వచ్చాయని.. తమకు నష్టాన్ని కలుగ చేశారని.. బాధతో.. కక్షలతో జీవితాన్ని మధ్యలో తుంచేసుకుంటున్నారు. ఎందుకిలా జరుగుతోంది? 
 
ప్రస్తుతం మారుతున్న సమాజంలో మరణాల సంఖ్య అధికమౌతున్నాయి. కక్షలు.. కార్పణ్యాలు.. ఆర్థిక ఇబ్బందులు.. కష్టాలు రావడంతో చావే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. ఎదురుదెబ్బలకు తట్టుకుని ధైర్యంగా నిలబడకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జీవితంలో కష్టాలు వచ్చాయని.. వాటిని భరించలేమని ఆందోళన చెందుతూ జీవితాన్ని అంతం చేసుకోవడం మూర్ఖత్వం అనగా ఇంకేమనాలి.
 
నిరాశ, నిస్పృహలు లోనైనప్పుడు మనస్సులో పిచ్చిపిచ్చి ఆలోచనలు పరిభ్రమిస్తాయి. ఆ క్షణంలో బలహీనపడ్డామంటే మాత్రం అంతే సంగతులు. ప్రతి సమస్యకు చావులోనే సమాధానం వెతుక్కుంటారా? ఆలోచన వచ్చిందే తడవుగా అఘాయిత్యానికి పాల్పడకుండా తమకు తాము ఓ గడువు విధించాలని మానసిక విశ్లేషకులు సూచిస్తుంటారు.
 
భయం.. మరింత భయాన్ని కలుగజేస్తుంది. ఓ చిన్న భయం బతుకంతా వ్యాపింపజేస్తుంది. భయం సకల సమస్యలకు మూలంగా తయారవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే భయం నీడలాంటిదని చెప్పవచ్చు. అది నీడలా వెంటాడుతుంది. ధైర్యంగా పోరాడటం.. భయాన్ని పారదోలే విధంగా మానసికంగా దృఢంగా తయారు కావాలి. 
 
చిన్న సమస్యకూ చావు ఒక్కటే పరిష్కారం అనే భావన నుంచి బయటపడాలి. తీవ్రనిరాశ నిస్పృహలో ఉన్న వారితో సాంత్వన చేకూర్చేలా మాట్లాడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు.. కౌన్సెలింగ్‌ చేయాలి లేదా మానసిక వైద్య నిపుణుడు వద్దకు తీసుకువెళ్లడం చేస్తే పరిస్థితిలో నుంచి మార్పు వస్తుంది.