శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 22 మే 2019 (18:12 IST)

వయస్సుకు, ఎత్తుకు తగిన బరువే వుండాలి...

పెద్దవారైనా లేక పిల్లలైనా వారి వయస్సుకు, ఎత్తుకు తగిన బరువు ఉంటేనే అందంగా కనిపిస్తారు. అలా లేకపోతే చూడటానికి వికారంగా కనిపించడమే కాక చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటే శక్తిహీనత నుండి బయటపడవచ్చు. శరీర బరువును పెంచే పప్పులు, గ్రుడ్డులు, చేపలు, మాంసం వారానికి నాలుగు లేక అయిదుసార్లు తినాలి. 
 
శాకాహారులు అయితే అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. ప్రతి రోజూ డ్రైప్రూట్స్ తీసుకోవాలి. తినే ఆహారం మోతాదు పెంచాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. కనుక కొంచెం కొంచెంగా ఆహారం మోతాదును పెంచడం మంచిది. 
 
మూడుపూట్ల భోజనం చేస్తూ మధ్య మధ్యలో చిరుతిండ్లు తినడం మంచిది. అంతేకాకుండా కూరగాయలు, పండ్లు కూడా సమృద్ధిగా తీసుకోవాలి. చేమ, కంద, బంగాళదుంపలు వంటి దుంపకూరలు ఎక్కువగా తినాలి. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవాలి.