బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 20 మే 2019 (14:38 IST)

ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగాలో మీకు తెలుసా?

మనం ప్రతిరోజూ నీటిని తప్పనిసరిగా తాగాలి. నీటిని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలని చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే అసలు ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..! 
 
ఆహారం తినడానికి 30 నిమిషాల ముందు, అలాగే తిన్న 30 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయడం వల్ల మన జీర్ణాశయంలో జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి కావడమే కాకుండా మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందట.
 
కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది ఈ విధానాన్ని పాటించడం లేదు. అయితే ఈ నియమాన్ని తప్పకుండా పాటించినట్లయితే, చాలా వరకు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.