వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి....
ఎండ ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో చాలా మందికి వేడి చేస్తుంది. అధిక వేడి కారణంగా వడదెబ్బ బారినకూడా పడొచ్చు. వేడి చేస్తే మలమూత్రాలు విసర్జింటేటప్పుడు మంట, శరీరంపై ర్యాషస్, చెమటపట్టడం వల్ల దురదలు, చెమటకాయలు వస్తాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, ముక్కులో నుండి రక్తం కారడం జరుగుతుంది. శక్తి నశించి నీరసంగా ఉండటం, తిమ్మిర్లు రావడం కూడా జరుగుతుంది. అధిక వేడి వల్ల శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
ఆమ్లేట్లు, చికెన్ తింటే వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవి కాలంలో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మసాలాలకు, జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. నీరు అధికంగా తాగడం వల్ల శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతారు. నీరు తాగడం వల్ల చిన్నచిన్న రోగాలు దరిచేరకుండా ఉంటాయి. కానీ ఫ్రిజ్‌లో నీళ్ళను అస్సలు తాగకూడదు. దీని వలన శరీరంలో వేడి పెరిగిపోతుంది. మట్టి కుండలో నీరు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు నష్టపోకుండా ఉంటారు.