సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 మే 2019 (22:17 IST)

పాలతో గంధం చెక్కని అరగదీసి అలా చేస్తే...

వేసవికాలం వచ్చిందంటే ఆడవాళ్లకు ప్రధానంగా వేదించే సమస్య ఎండల్లో తిరగడం వలన ముఖంలో అందం తగ్గుతుందేమోనని. కొందరిలో ఎండలో తిరగడం వల్ల ముఖం కాంతిహీనంగా తయారవుతుంది. రకరకాలైన క్రీములు వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. మన ప్రకృతిలో సహజంగా లభించే గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. చర్మ ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం వంటి లక్షణాలు గంధంలో ఉన్నాయి. మరి గంధాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. 
 
2. సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీర భాగాలు రంగు మారుతుంటాయి.ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండు సార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
3. ముఖంపై మొటిమల తాలూకా మచ్చలు కలవరపెడుతుంటాయి. అలాంటివారు గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరాక కొన్ని నీళ్లు తీసుకుని తడుపుతూ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగివేయాలి.ఇలా చేయడం వల్ల  మొటిమల సమస్య త్వరగా దూరమవుతుంది. అంతేకాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.