మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (09:25 IST)

ఆకుకూరల్ని ఇలా తీసుకుంటే.. గుండెకు ఎంతో మేలు

ఆకుకూరలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువును నియంత్రిస్తాయి. రోజుకో కప్పు ఆకుకూరను తీసుకుంటే అనారోగ్య సమస్యలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే వారంలో వీలైనంత ఎక్కువగా వీటిని తీసుకోవాలంటారు. 
 
ఆకుకూరల్లో అత్యధిక మొత్తంలో పీచు వుంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. పాలకూర, బచ్చలి, పుదీనా, కొత్తిమీర వంటివాటిని కూరల్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. కూరల్లా కాకుంటే స్మూథీ లేదా సలాడ్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి తగిన పోషకాలు అందుతాయి. 
 
ఆకుకూరల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చిన్నచిన్న అనారోగ్యాలను దూరం చేస్తాయి. ముదురు ఆకుపచ్చ ఆకుకూరల్లో క్యాల్షియం, విటమిన్‌-కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలూ, కణజాలాల ఆరోగ్యానికి సహకరిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఎ, సి విటమిన్లు కూడా అధికమే. పైగా కెలొరీలు కూడా తక్కువే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.