శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (22:48 IST)

అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించే గ్రీన్ టీ, టమోటా జ్యూస్

Tomato
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి కొంతమంది కొన్ని పానీయాలను ఉపయోగిస్తారు. అలాంటి పానీయాలు ఏవో తెలుసుకుందాం.

 
గ్రీన్ టీతో కొలెస్ట్రాల్‌ అదుపులో వుంచుకోవచ్చు. గ్రీన్-టీ బరువును తగ్గించడమే కాకుండా, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించగలదు. టమోటా రసం కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఐతే కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ హెచ్చుస్థాయిలో వున్నవారు వైద్యులను సంప్రదించాల్సిందే.

 
ఓట్ మిల్క్ కూడా కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. వాస్తవానికి, ఇది బీటా-గ్లూకాన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటితో పాటు జీవనశైలిని మార్చుకోవాలి. వ్యాయామం కూడా చేయాలి.