మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:39 IST)

జామకాయ గుజ్జు-బెల్లంతో చేసిన దోసెల్ని తీసుకుంటే?

జామకాయను అంత సులభంగా తీసిపారేయకండి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. జామలో విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ధాతువులు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మ

జామకాయను అంత సులభంగా తీసిపారేయకండి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. జామలో విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ధాతువులు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జామకాయను ఎముకలకు బలాన్నిస్తుంది. 
 
గింజలను తొలగించి.. జామ గుజ్జును మాత్రమే తీసుకుని, అందులో బెల్లాన్ని, దోసెపిండితో కలిపి దోసెలు తయారు చేసి పిల్లలకు ఇస్తే ఇష్టపడి తింటారు. రోజూ ఓ జామపండుతను తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. రోజు రెండు జామపండ్లను తింటే పిల్లలు సులభంగా ఎదుగుతారు. జామ పండును లేకా కాయను ముక్కలు చేసుకుని తినడం కంటే.. అలాగే తినడం ద్వారా దంత సమస్యలు దరిచేరవు. 
 
ఇంకా చర్మానికి జామకాయ ఎంతో మేలు చేస్తుంది. ముఖానికి తేజస్సుని ఇస్తుంది. చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది. చర్మం, ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. ఇంకా నియంత్రిస్తుంది. రోజూ ఓ జామకాయను తినడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.