మంగళవారం, 21 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2023 (22:52 IST)

జీడిపప్పు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Cashew nuts
జీడిపప్పు. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముక పుష్టికి ఇవి దోహదపడుతాయి.
 
జీడిపప్పులో వున్న యాంటీఆక్సిడెంట్లు మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. కేన్సర్ సమస్యను అడ్డుకునే గుణాలు జీడిపప్పు కలిగి ఉంది.
 
రక్తహీనత ఉన్న రోగులకు జీడిపప్పు మేలు చేస్తుంది. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు.