సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:43 IST)

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. ఏం చేయాలి..?

నాగరికత పెరిగే కొద్దీ జీవన శైలిలో మార్పుల కారణంగా ఒత్తిడి సాధారణమైపోయింది. వివిధ కారణాల రీత్యా ఏర్పడే మానసిక ఒత్తిడికి చెక్ పెట్టాలంటే మీరు చేయాల్సిందల్లా.. ఈ టిప్స్ పాటించడమే. 
 
ఒత్తిడిలో ఉన్నప్పుడు రీడింగ్ మీకెంతో సహకరిస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించండి. మంచి పుస్తకాలు చదవండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు వంట చేయండి. మీకు నచ్చిన వంటకాన్ని వెరైటీగా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చిన పాటలు వినండి. మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, తక్షణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఒత్తిడిలో ఉన్నప్పుడు తోటపని చేయండి. తోటపని మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రకృతికి చేరువైతే మీ మనస్సుకు విశ్రాంతి, ప్రశాంతత కలుగుతుంది. ఇక యోగా కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. యోగా ద్వారా శరీరంలోని కండరాలు సాగి, సడలింపు చెంది తద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.