గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:14 IST)

రాత్రివేళ పెరుగు తింటే..?

పెరుగు వలన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే క్యాల్షియం వలన దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలామంది రాత్రివేళ పెరుగన్నం తినొచ్చా.. లేదా అనే సందేహం చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. 
 
ఎందుకంటే.. రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని చెప్తుంటారు. వాస్తవానికి రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా.. లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వలన మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచు జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం ఆరగించకుండా ఉండడమే మంచిది. దగ్గు, జలుబు సమస్య లేని వారు రాత్రిపూట నిర్భయంగా పెరుగు లేదా పెరుగన్నం ఆరగించవచ్చు. 
 
ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం సమయంలో తినొచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.