1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 ఏప్రియల్ 2024 (19:39 IST)

జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Cashew nuts
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి.
జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది.
జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
పోషకాహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులను తినవచ్చు.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పును మితంగా తీసుకోవాలి.