ఇడ్లీలు ఆరోగ్యానికి మంచివా కావా?

సిహెచ్| Last Modified సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:11 IST)
మినప పప్పు, బియ్యం తగుపాళ్లలో కలిపి చేసే ఇడ్లీలు ఉత్తమ అల్పాహారం. ఇడ్లీల్లో కొలెస్ట్రాల్ వుండదు. క్యాలరీలు కూడా తక్కువే వుంటాయి. ఒక ఇడ్లీలో 40 నుండి 60 క్యాలరీలు మాత్రమే వుంటాయి. ఇడ్లీలు తెల్లగా రావాలని పొట్టు తీసిని మినపప్పు, తెల్లటి బియ్యంపు రవ్వ వాడకూడదు. దీనివల్ల ఆ ధాన్యాల్లోని పోషకాల్ని కొంతమేర నష్టపోతాం.

మినపప్పులో ప్రోటీన్లు, బియ్యం రవ్వలోని పిండిపదార్థాలు శక్తినిస్తాయి. రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు పదార్థంలు, యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని బి విటమిన్లనూ పొందవచ్చు. పిండి పదార్థాల వల్ల ఇడ్లీలు తేలికగా జీర్ణం అవుతాయి. ఇడ్లీతో పాటు సాంబారు, పప్పు, గుడ్లు, బాదం, ఆక్రోట్ పప్పులు, మొలకెత్తిన గింజలు తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. ఇటీవలికాలంలో ధాన్యాలతో ఇడ్లీలు చేస్తున్నారు. ఇవి పోషకాల్లో మెరుగైనవి. చిరుధాన్యాల్ని బియ్యానికి ప్రత్యామ్నాయంగా వాడితే ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు లభిస్తాయి.దీనిపై మరింత చదవండి :