మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:48 IST)

రాత్రిపూట అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది

అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలుసు. కచ్చితంగా ఇది నిజం. కానీ ఆరోగ్యానికి మేలు చేయాలంటే సరైన సమయంలో తినడం ముఖ్యం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు. ఎందుకంటే కొన్ని సమయాల్లో ఇది శరీరానికి హాని కలిగించవచ్చు. అందుకే సరైన సమయంలో అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఏ సమయంలో అరటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. రాత్రిపూట అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది..
అరటిలో ఇనుము, ట్రిప్టోఫాన్, విటమిన్ బి 6, విటమిన్ బి అలాగే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే అరటిపండ్లు రాత్రిపూట తినకూడదు. చాలా మంది నిపుణులు రాత్రి అరటి తినడం వల్ల ఎటువంటి హాని లేదని చెబుతారు కానీ ఇది తప్పు. అరటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి ఇవి మీకు శక్తిని ఇస్తాయి. కానీ మీ శరీరం రాత్రిపూట విశ్రాంతి అడుగుతుంది. మీరు ఈ సమయంలో అరటిపండు తింటే మీకు శక్తి వస్తుంది కానీ నిద్ర పట్టడం కష్టం. ఇది కాకుండా అరటిపండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే పడుకునే ముందు అరటి తినకుండ ఉంటేనే మంచిది.
 
 
2. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినవద్దు
ఆయుర్వేదం ప్రకారం.. జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండు తినకూడదు. వాస్తవానికి ఆయుర్వేదంలో వాత, కఫా, పిత్త అనే మూడు స్వభావాలు ఉంటాయి. ఇందులో కఫ స్వభావం ఉన్న రోగులు అరటి తినకుండా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం కూడా ప్రజలు సాయంత్రంపూట అరటిపండు తినకూడదు.
 
3. ఖాళీ కడుపుతో తినకూడదు
ఉదయం అల్పాహారంలో అరటిపండు చేర్చండని అందరు చెబుతారు కానీ అరటిపండ్లు ఖాళీ కడుపుతో తినకూడదు. కానీ అరటితో పాటు ఇతర పండ్లను కలిపి తింటే మంచిది. ఎందుకంటే అరటిలో మెగ్నీషియం ఉంటుంది ఇది రక్తంలో కాల్షియం, మెగ్నీషియం మొత్తాన్ని మరింత దిగజార్చుతుంది. అందుకే అరటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు.