శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 జులై 2024 (23:14 IST)

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

jackfruit
పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. 
 
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండులో ఉండే పోషకాలు, విటమిన్స్ సమస్యను తగ్గిస్తాయి.
పనసలో వుండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది.
ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి పనస పండు కాపాడుతుంది.
మోస్తరు మోతాదులో పనస పండు తింటే షుగరు వ్యాధి ఉన్నవారికి మంచిది.
పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.
ఈ పండులోని పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్, అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.
పనస పండు తింటుంటే చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.
మోతాదుకి మించి తింటే డయారియా సమస్య వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.