1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:28 IST)

పైనాపిల్ చిన్న ముక్క ఒకటి తింటే చాలు

pineapple
అనాస పండు లేదా పైనాపిల్. ఈ పండు తింటుంటే ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైనవి తగ్గుతాయి. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగుపరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఈ పండుతో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. పైనాపిల్ ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరిగి నిగారింపు వస్తుంది.
 
పైనాపిల్‌ను తరచుగా తింటుండటం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గేందుకు అనాసపండు తింటుంటే ప్రయోజనం వుంటుంది. పైనాపిల్ రసాన్ని రోజుకి 4 సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. పైనాపిల్ రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
 
కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. అనాస పండు పచ్చకామెర్లను నయం చేసే గుణాన్ని కలిగి ఉంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది కనుక గర్భిణిలు ఈ పండుకు దూరంగా ఉండాలి.