1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (19:38 IST)

కరోనా కాలం: మునగాకు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

కరోనా కాలంలో మునగ ఆకులను తేలికగా తీసిపారేయకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం. అవి మునగకాయలో చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి. 
 
ఇంకా ఇందులో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి మేలు కలుగుతుంది. మునగకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇంకా గొంతులో ఏర్పడే మంటను ఈ ఆకులు తగ్గిస్తాయి.
 
ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవి శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.