శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (14:54 IST)

రోజూ ఆరెంజ్ పండును తినండి.. మతిమరుపును దూరం చేసుకోండి..

రోజూ ఆరెంజ్ పండును తినండి.. మతిమరుపును దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఒక పుల్లని పండు (ఆరంజ్‌, దానిమ్మ, ద్రాక్ష) తినడం ద్వారా మతిమరుపునకు దూరంగా ఉండవచ్చనని ఆరోగ్య నిపుణులు చెప్తు

రోజూ ఆరెంజ్ పండును తినండి.. మతిమరుపును దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఒక పుల్లని పండు (ఆరంజ్‌, దానిమ్మ, ద్రాక్ష) తినడం ద్వారా మతిమరుపునకు దూరంగా ఉండవచ్చనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజూ ఆరెంజ్‌ జ్యూస్‌ తాగటం వల్ల కిడ్నీలో ఉండే స్టోన్స్‌ కరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. కొవ్వుశాతంను తగ్గించటంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం వీటికుంది. ఆరెంజ్‌పండ్లలో ఉండే విటమిన్‌-సి వల్ల కీళ్లనొప్పులు తగ్గే అవకాశం ఉంది.  
 
నారింజపండ్లలో నీటిశాతం ఎక్కువ. నీటిశాతం శరీరంలో తక్కువైన వారికి నారింజరసం తాగిస్తే ఉపశమనం పొందుతారు. నోటిదుర్వాసనని పోగొట్టే గుణం వీటికుంది. ఆకలి తక్కువగా ఉండేవారు ఆరెంజ్‌ తింటే ఆకలి బాగా పుడుతుంది. అధికంగా ఉండే బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండెవ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే లాక్టిక్‌ ఆమ్లం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి.