శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (11:42 IST)

మహిళల సౌందర్యాన్ని పెంచే పాలకూర.. ఓవెరియన్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే..?

పాలకూరను తీసుకోండి.. ఓవెరియన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అవసరమైన ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది,

పాలకూరను తీసుకోండి.. ఓవెరియన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అవసరమైన ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. పాలకూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్‌, ఫాస్ఫరస్‌, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీలు పుష్కలంగా ఉన్నాయి. 
 
మహిళల సౌందర్యాన్ని పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్‌ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకుంటే.. శరీరానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. 
 
పాలకూరలో లభించే విటమిన్‌ సి, ఏలు, మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో పాలకూర భేష్‌గా పనిచేస్తాయి.