గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:15 IST)

రాత్రి పూట మేల్కొని నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న వారికి సజ్జలు..? (video)

Pearl Millet
రోజువారీ డైట్‌లో సజ్జను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉదయం పూట సజ్జలతో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి తగిన పోషకాలు లభిస్తాయి. ప్రస్తుతం సజ్జలు తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది.

రోజూ ఒకకప్పు సజ్జలను ఆహారంలో భాగం చేసుకుంటే కంటి నరాలకు మేలు చేకూరుతుంది. దృష్టి లోపాలు తొలగిపోతాయి. గుండెకు మేలు జరుగుతుంది. 
 
కిడ్నీ సంబంధిత రోగాలు వుండవు. నరాలకు ఉత్సాహాన్నిస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని అనవసరపు నీటిని తొలగిస్తుంది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టునెరవడాన్న తగ్గిస్తుంది. రాత్రి పూట మేల్కొని నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న వారు సజ్జలను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంకా సజ్జలు ఆహారంగా తీసుకుంటే మానసిక ఒత్తిడి మాయమవుతుంది. 
 
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే సజ్జలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నవారు సజ్జలతో జావలా తయారు చేసుకుని తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
మానసిక ఒత్తిడిగా వున్నప్పుడు, ఎండల్లో ఎక్కువగా తిరిగే వారు.. శారీరకంగా అధికంగా శ్రమించే వారు.. సజ్జ రొట్టెలను, జావను తీసుకోవడం మంచిది. అజీర్ణ ఇబ్బందులు తొలగిపోవాలంటే.. సజ్జలతో జావ తాగడం మంచిది. పెద్ద పేగుల్లో ఏర్పడే రుగ్మతలను కూడా ఇది దూరం చేస్తుంది. నోటిపూతకు చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.