శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (17:44 IST)

అలెర్జీలను దూరం చేసే పుదీనా

పుదీనాలోని గొప్ప ఔషధ గుణాలు అలెర్జీలను దూరం చేస్తుంది. పుదీనా ఉబ్బసాన్ని దూరం చేస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో పచ్చడి రూపంలో తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుదీనా ఆకుల్లో యాంటీ ఇ

పుదీనాలోని గొప్ప ఔషధ గుణాలు అలెర్జీలను దూరం చేస్తుంది. పుదీనా ఉబ్బసాన్ని దూరం చేస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో పచ్చడి రూపంలో తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా వున్నాయి. ఇవి అలెర్జీని దూరం చేస్తాయి. అంతేగాకుండా నోటిలోని హానికర బ్యాక్టీరియాలను కూడా నశింపజేస్తుంది. కాబట్టి వంటకాల్లో పుదీనాను తరచూ తీసుకుంటూ వుండాలి. 
 
పుదీనాలో వుండే క్యాల్షియం, ఫాస్పరస్ మూలకాలు, విటమిన్ సి. డి, ఇ, బిలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాలను దూరం చేస్తాయి. పుదీనా శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా ఆకులు దరిచేరనివ్వవు. తద్వారా వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే జలుబు, గొంతునొప్పిని పుదీనా ఆకులు నయం చేస్తాయి. 
 
ఒక గిన్నెలో వేడినీటిని తీసుకుని అందులో కొన్ని చుక్కల పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టుకున్నట్లైతే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.