ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (12:55 IST)

ఎక్సర్‌సైజ్ చేయకపోతే.. గ్లాసుడు రెడ్ వైన్ తాగేయొచ్చా?

రోజూ గంటపాటు వ్యాయామం చేస్తూ.. ఒక రోజు వ్యాయామాలకు డుమ్మా కొట్టారా... అయితే ఆందోళన పడొద్దు. వ్యాయామం డుమ్మా కొట్టిన రోజు ఓ గ్లాసుడు రెడ్ వైన్ తాగేస్తే సరిపోతుంది. గంటపాటు వ్యాయామం చేయడం ద్వారా వచ్చే ఆ

రోజూ గంటపాటు వ్యాయామం చేస్తూ.. ఒక రోజు వ్యాయామాలకు డుమ్మా కొట్టారా... అయితే ఆందోళన పడొద్దు. వ్యాయామం డుమ్మా కొట్టిన రోజు ఓ గ్లాసుడు రెడ్ వైన్ తాగేస్తే సరిపోతుంది. గంటపాటు వ్యాయామం చేయడం ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ఓ గ్లాసుడు రెడ్ వైన్ సేవించడం ద్వారా పొందవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. ఎర్ర ద్రాక్షలో రెస్‌వెరాట్రోల్ అనే యాంటీ-యాక్సిడెంట్ వుంటుంది. 
 
గంటపాటు వ్యాయామం చేస్తే కండరాలు, గుండె ఎంత బాగా పనిచేస్తాయో.. అదే తరహాలో ఎర్రద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్ మన శరీరంపై పనిచేస్తుంది. శారీరక పరంగా వ్యాయామాలు చేయలేని వారికి రెడ్ వైన్ ఎంతగానో సహకరిస్తుంది. రెస్‌వెరాట్రోల్‌ యాంటాక్సిడెంట్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలు, గుండె పటిష్టంగా ఉంటాయి. రెడ్ వైన్ ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. క్యాన్సర్ రిస్క్ నుంచి దూరం చేసుకోవచ్చు.
 
రెడ్ వైన్ తీసుకోవడం ద్వారా శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఎక్కువగా పనిచేసినా త్వరగా అలసిపోరు. వ‌య‌స్సు  మీద ప‌డ‌డం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. కీళ్లనొప్పులు తగ్గుతాయి. గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.