గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (19:55 IST)

కూల్‌డ్రింక్స్‌ వద్దు.. కీర రసమే ముద్దు.. అధిక బరువు పరార్

కూల్‌డ్రింక్స్‌ను అధికంగా సేవించడం ద్వారా ఒబిసిటీ తప్పదు. బరువు పెరుగుతారు. వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది. ఫలితంగా డయాబెటిస్​, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు కూల్​డ్రింక్స్​కి దూరంగా ఉండాలి. 
 
బరువు తగ్గాలనుకునే వారు.. కీర దోస జ్యూస్ తాగవచ్చు. ఇందులో నీటి శాతం అధికం. తక్కువ క్యాలరీలు వుంటాయి. సహజంగా బరువు తగ్గాలనుకున్నా, చర్మం  ఆరోగ్యంగా ఉండాలనుకున్నా కీర దోస జ్యూస్ తాగడం మంచిది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది.
 
కీరదోసతో పాటు పుదీనా రసం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఒబిసిటీని దూరం చేస్తుంది. అలాగే టొమాటోలో విటమిన్​-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, పోషక విలుకలు ​ కూడా అధికం. ఏ సీజన్​లోనైనా టొమాటో జ్యూస్ తాగితే మంచిది. వేసవిలో నిమ్మరసం శరీరాన్ని, చర్మాన్ని హైడ్రేట్​గా కాకుండా వుంచుతుంది. అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. 
 
ముఖ్యంగా మామిడి రసం తాగడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. పచ్చి మామిడి రసం ఎండవల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.