శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (17:14 IST)

మనం చేస్తున్న ఘోరమైన ఉప్పు తప్పు, ఏంటది? (video)

దొడ్డు ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి, అయోజైజ్డ్ సన్నఉప్పును  20/- పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి అంటున్నారు నిపుణులు.
 
మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు.
 
అప్పట్లో బీపీలు లేవు !
ఒంట్లో ఎముకల నొప్పులు లేవు.!!
థైరాయిడ్ సమస్యల్లేవు.!!!
ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు,
బస్తాలు జస్ట్, అలా వదిలేస్తారు
ఎందుకంటే ఉప్పును ఎవరూ దొంగతనం చేయరు.
 
ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా ఉండేది.
 
ఆ రోజులు పోయాయి… 
అంతా సన్న ఉప్పు, 
అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా జొరబడింది!
 
దొడ్డు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ దీన్నే ప్రిఫర్ చేయసాగారు… కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది. ఏళ్లకేళ్లు మనకేమీ పట్టడం లేదు
 
ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడిందీ అంటే సముద్రపు ఉప్పు ప్రమాదకరం, అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి… 
 
మెల్లిమెల్లిగా దీని దుష్ప్రభావాలు అర్థం కాసాగాయి… ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన సైనైడ్ అంశాలుంటయ్…
 
అవి 
1)  E535 – sodium ferrocyanide, 
2) E536 – potassium ferrocyanide, 
3) E538 – calcium ferrocyanide… 
 
మరికొన్నీ అనారోగ్య హేతువులుంటయ్… ఇవి బీపీలను పెంచినయ్… థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని పెంచినయ్… గుండె జబ్బుల్ని పెంచినయ్… డయాగ్నయిజ్ లేబరేటరీలు హేపీ, మందుల కంపెనీలు హేపీ, డాక్టర్లు హేపీ… విధి లేక ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు సైంధవ లవణాన్ని సూచించసాగారు… 
 
కానీ ధర ఎక్కువ… ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ… ఇప్పటికీ కిచెన్లలో సైంధవ లవణం లేదా సముద్రపు సహజలవణం మంచిది. నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు… 
 
కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్‌ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం… దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టవుతున్నది. అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, నివారణ చర్యల్లో పడ్డయ్.
 
మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ సముద్రపు ఉప్పు అమ్మడం స్టార్టయింది… 
పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ… మరేం చేస్తాం..? కానీ రూల్స్ అలాగే ఉన్నయ్… 
 
దీనిమీద గత ఏడాది కర్నాటక హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. మరి జనం ఏం చేయాలి..? ఏముందీ..? ఆ దిక్కుమాలిన ఉప్పును తగ్గించేసి, వీలైనంతవరకూ దొడ్డు ఉప్పు అనగా సముద్రపు ఉప్పు, సహజలవణం వైపు మళ్లడం బెటర్… 
 
మార్కెట్‌లో బాగానే దొరుకుతున్నది ఇప్పుడు… 
 
అయితే నెట్‌లో వెబ్‌సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్… ఏమనీ అంటే..? ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని.
 
తప్పు, అలాంటి వాటి జోలికి పోవద్దు… ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది… సైంధవ లవణం అయితే మరీ మేలు. ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం… అది రక్తపోటుకు మంచిది కాదు… అందుకని ఆ వెబ్ డాక్టర్ల జోలికి పోకుండా, జస్ట్, వంటలకు తగినంత… వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్…
 
ఉప్పు కేవలం రుచి కోసమే… ఆరోగ్యం కోసం కాదు… మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది… 
అందుకని బీ కేర్ ఫుల్.