మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 జులై 2021 (07:41 IST)

నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!!

నెయ్యి తింటే కొవ్వు పెరిగే అవకాశం ఉందని, నెయ్యి అరగదని రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నెయ్యిలో అమైనో ఆమ్లాలుంటాయి. వాటి వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే.

కొంతమంది నెయ్యి తింటే అరగదని.. నెయ్యిని తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అందువల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనుషుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది.

నెయ్యిలో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీ వైరస్‌ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు కూడా తొలగిపోతాయి.