శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (11:36 IST)

రాత్రిపూట నిద్రపోతున్నారా? లేదా..?

ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటున్నారా, చిరాకుగా ఉందా? పని మీద మీరు శ్రద్ధ పెట్టలేకపోతున్నారా? ఎవరైనా మాట్లాడితే విసుగ్గా ఉంటోందా? వీటన్నిటికీ కారణం సరిగ్గా నిద్రపోకపోవడమే. నిద్రలేమి మీకు కలిగించే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. నిద్రలేమితో బాధపడేవారు అనుభవించే నరకం చెప్పడానికి సాధ్యం కాదు. 
 
పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
 
రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో ఉంటారని తెలిపింది. సాధారణంగా అలసిపోతే చికాకు కనిపిస్తుంది. అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగానే తమ ప్రతాపాన్ని ఎదుట వారిపై చూపిస్తారని పరిశోధనల్లో తేలింది.
 
 కొంత మంది పరిశోధకులు కొందరిని ఎంపిక చేసి రెండు రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు. కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే. నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. కడుపు సరిపడా పౌష్టికాహారం తినండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, సరదాగా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు.