మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (15:06 IST)

30 దాటిన మహిళలు సోయాపాలు తీసుకోవాల్సిందే..

30 దాటిన మహిళలు తప్పకుండా సోయాపాలు తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య తలెత్తుంది. దీని తీవ్రతను తగ్గించుకోవాలంటే.. సోయాపాలు తీసుకోవడం ఉత్

30 దాటిన మహిళలు తప్పకుండా సోయాపాలు తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య తలెత్తుంది. దీని తీవ్రతను తగ్గించుకోవాలంటే.. సోయాపాలు తీసుకోవడం ఉత్తమం. ఇందులోని ఫైట్ ఈస్ట్రోజెన్ ఎముకలకు తగిన క్యాల్షియం అందించేందుకు ఉపయోగపడుతుంది. 
 
అలాగే మెనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోతుంటుంది. తద్వారా హృద్రోగం, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు వేధిస్తాయి. సోయాపాలును తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. సోయాలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపాన్ని సవరిస్తుంది. 
 
సోయా పాలలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా శరీరానికి కొత్త శక్తి అందుతుంది. ఇంకా చురుగ్గా పనిచేసేందుకు ఈ ధాతువులు ఉపయోగపడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.