శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By mohan
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:18 IST)

రాత్రి భోజనం... ఇవి తెలుసుకోండి...

రాత్రి 7 గంటలపైన భోజనం చేయడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది రాత్రుల్లో భోజనం మానేసి పడుకుంటారు. అయితే వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అది నిద్ర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో తీసుకో

రాత్రి 7 గంటలపైన భోజనం చేయడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది రాత్రుల్లో భోజనం మానేసి పడుకుంటారు. అయితే వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అది నిద్ర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో తీసుకోకపోవడమే మంచిదని, ఒకవేళ తీసుకున్నట్లయితే అవి శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. జిడ్డుగా ఉండే పదార్థాలు, వంటనూనె అధికంగా ఉండే ఆహార పదార్థాలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినవి, పెరుగు లేదా ఐస్‌క్రీమ్ వంటివి రాత్ర్రి వేళల్లో తినకూడదు. అలా తినాల్సి వచ్చిన పక్షంలో కొద్దిగా మాత్రమే తినాలి.
 
మరికొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందాం:
 
1. పెరుగు తినడం మానెయ్యండి - రాత్రి వేళల్లో పెరుగు తినడం వలన అది జలుబు, దగ్గును అధికం చేస్తుంది.
2. భోజనానంతరం ఎక్కువ నీరు త్రాగకండి. అయితే ఒక గంట తర్వాత కొద్దిగా వేడి నీరు తీసుకోండి. ఆ నీరు త్రాగడం వలన జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
3. పసుపు వేసిన పాలను త్రాగండి- పసుపు వేసిన పాలను త్రాగడం వలన కఫం రాకుండా చేస్తుంది, బ్యాక్టీరియాని తగ్గించడంతోపాటు బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.
4. చక్కెర అధికంగా ఉండే కేక్‌లు, కుకీలు తినకండి. ముఖ్యంగా చక్కెరకు బదులుగా తేనెను వాడడం వల్ల అది కూడా కఫం రాకుండా చేస్తుంది, అలాగే బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
5. దాల్చిన చెక్క, పెద్దజీలకర్ర (సోంపు), మెంతులు మరియు ఏలకులను ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని రుచిగా మార్చడమే కాక శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతాయి మరియు శరీర బరువును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
6. పచ్చి సలాడ్‌లను రాత్రుల్లో తినవద్దు, ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పు ధాన్యాలు, బ్రోకోలీ వంటివి తీసుకోవడం వల్ల మీ కొవ్వు నిల్వలను కరిగించడంలో సహాయపడతాయి.
7. ఉప్పు వాడకం బాగా తగ్గించండి, అందువల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు మరియు అకాల మరణం కలగకుండా ఉంటుంది.
8. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వలన జీర్ణమయ్యేందుకు కష్టతరంగా మారుతుంది. అందుకే మితాహారం తీసుకోండి.