శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:26 IST)

చలికాలంలో పుట్టగొడుగులను తినాలట.. అప్పుడే..? (video)

చలికాలంలో పుట్టగొడుగులను తినాలట. అప్పుడే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలను తొలగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మన శరీరంలో వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. 
 
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పుట్టగొడుగుల్లో మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యల‌ను పోగొడుతుంది.
 
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే ఐరన్ అనీమియా ఉన్న పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో రక్తం పెరిగేలా చేస్తుంది. ఎర్ర‌ రక్త కణాల సంఖ్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.