కోవిడ్, బర్డ్ ఫ్లూ ఆందోళన: ఈ మూడు సురక్షిత, ప్రొటీన్ ప్రత్యామ్నాయాలను ప్రయత్నించండి
కోవిడ్ కేసులు స్థిరంగా తగ్గుతుండటం మనలో చాలామందికి అతి పెద్ద ఉపశమనం. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందనే వార్తలు మనందరినీ కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. బర్డ్‌ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ కేసులు దేశంలో చాలా చోట్ల ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి.
ప్రధానంగా పౌల్ట్రీ పక్షులు అయినటువంటి చికెన్ లేదంటే టర్కీలపై అధిక ప్రభావం చూపుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందక పోయినప్పటికీ, చాలామంది ముందుజాగ్రత్త చర్య అంటూ పౌల్ట్రీ పదార్ధాలను తినడం మానేస్తున్నారు. ఇప్పటి వరకూ చికెన్, గుడ్లు వంటివి మాంసాహారుల పౌష్టికాహార అవసరాలను తీరుస్తున్నాయి. కానీ బర్డ్ ఫ్లూ వ్యాధి భయాల కారణంగా చాలామంది సురక్షిత ప్రొటీన్ అవసరాల కోసం వెదుకుతున్నారు.
గత సంవత్సరం మనమంతా కూడా శక్తివంతమైన రోగనిరోధక శక్తి ద్వారా మాత్రమే వ్యాధులతో పోరాటం చేయగలమని తెలుసుకున్నాం. ఇక మనందరికీ తెలిసిన మరో అంశం ఏమిటంటే మనం తీసుకునే ఆహారంపైనే మన రోగ నిరోధక శక్తి కూడా ఆధారపడి ఉంది. ఈ రోగ నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన అంశంగా ప్రోటీన్ నిలుస్తుంటుంది. మన శరీరంలో శక్తికి, మన శరీరంలో రక్త సరఫరాలో భాగంగా ఆక్సిజన్‌ను శరీరంలోని అవయవాలకు చేరవేయడానికి కూడా అత్యంత కీలకంగా ప్రొటీన్ నిలుస్తుంది. అంటువ్యాధులు మరియు అనారోగ్యంతో పోరాడే యాంటీ బాడీలను తయారుచేయడంలో కూడా ప్రొటీన్ సహాయపడుతుంది. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా నూతన కణాలనూ తయారుచేస్తాయి. మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యవంతమైన మరియు సురక్షిత ప్రొటీన్ ప్రత్యామ్నాయాలను జోడించుకోవాలనుకుంటే ఇవి తినాల్సిందే.
బాదములు
ప్రొటీన్ అధికంగా కలిగిన ఆహారం బాదము. విభిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందిస్తుంది. శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములలో అత్యధిక స్థాయిలో ప్రొటీన్ ఉంది. ఇది మీ ఆకలిని తీర్చడంతో పాటుగా వ్యాయామాలు చేసిన తరువాత మీ కండరాలను మరమ్మత్తు చేయడంలో కూడా సహాయపడతాయి. ఓ గుప్పెడు బాదములు మీ ఆకలిని నియంత్రించడంలో తోడ్పడటంతో పాటుగా అధికంగా కేలరీలు తీసుకోవడాన్నీ నిరోధిస్తాయి. వీటితో పాటుగా, బాదములను పోషకాలు అధికంగా కలిగిన, సౌకర్యవంతమైన స్నాక్‌గానూ భావించవచ్చు. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, జింక్ లాంటి 15కు పైగా అత్యవసర పోషకాలు ఉంటాయి.
బాదములు అతి సౌకర్యవంతమైన రుచిని అందించడంతో పాటుగా ఎలాంటి భారతీయ మసాలా/స్పైసెస్‌తో అయినా వీటిని జోడించవచ్చు. ఈ బాదములలో అద్భుతమైన అంశమేమిటంటే వీటిలో ట్రాన్స్‌ఫ్యాట్ ఉండదు మరియు ఆరోగ్యవంతమైన మోనోశాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది.
టోఫు
వెగాన్స్ లేదంటే శాఖాహారులకు అత్యంత ప్రాచుర్యం పొందిన అవకాశంగా టోఫు నిలుస్తుంది. దీనిని సోయా పాలతో తయారుచేస్తారు. ప్రొటీన్‌కు అతి చక్కటి వనరు ఇది. అదనంగా, దీనిలో అత్యవసర అమినో యాసిడ్స్‌తో ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటివి సైతం ఉంటాయి. శాశ్వతంగా లేదా తాత్కాలికంగా మొక్కల ద్వారా ప్రొటీన్ పొందాలనుకునే వారికి ఇది ఖచ్చితమైన స్టార్టర్‌గా నిలుస్తుంది. దీని యొక్క వైవిధ్యత కారణంగా కూడా టోఫు అత్యంత ప్రాచుర్యం పొందింది. ఎన్నో సోయా ఉత్పత్తులు లాగానే దీనిని సైతం ఎన్నో రెసిపీలలో అపరిమిత మార్గాలలో ఎలాంటి కష్టం లేకుండానే వినియోగించవచ్చు. టోఫును ముక్కలుగా, తురుము రూపంలో, గ్రిల్ చేసి ఆఖరకు నేరుగా కూడా తినవచ్చు.
సీతాన్
వెగాన్ వైపు దృష్టి సారించిన వారికి అత్యంత ప్రాచుర్యం పొందిన మరో అవకాశం సీతాన్. ఈ జాబితాలో ముందు పేర్కొనబడిన వాటిలా కాకుండా సీతాన్‌లో సోయా కంటెంట్ అసలు ఉండదు. వాస్తవానికి దీని ఆకారం చూడగానే మాంసం లాగానే ఉంటుంది. మొక్కల ఆధారిత డైట్ వైపు మారాలనే మాంస ప్రియులకు ఇది ఓ రకంగా వరమనే చెప్పాలి. సీతాన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది, కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. ఇది వెయిట్ లాస్ డైట్‌గా కూడా తోడ్పడుతుంది. అదనంగా, దీనిలో కొద్ది పరిమాణంలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. అయితే దీనిని పూర్తిగా వీట్ గ్లూటెన్‌తో తయారుచేస్తారు. అందువల్ల గ్లూటెన్‌తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
-మాధురి రుయా, పిలాట్స్ నిపుణులు మరియు డైట్ అండ్ న్యూట్రిషన్ కన్సల్టెంట్