వట్టివేర్లు.. వేసవిలో ఎంతో మేలు చేస్తాయట..

Vattiverlu
సెల్వి| Last Updated: శనివారం, 23 మే 2020 (13:04 IST)
Vattiverlu
వట్టివేర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేర్లలో ఇనుము, మాంగనీస్‌, విటమిన్‌-బి6 పుష్కలంగా ఉంటాయి. వట్టివేర్లు జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. హృద్రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవాళ్లకు మంచిది. కళ్ల మంటలను నియంత్రిస్తుంది. చెమటకాయలని అడ్డుకుంటాయి. వట్టి వేర్లు చలువ చేస్తాయి. మండే ఎండల్లో ఎన్నోరకాలుగా ఉపశమనం అందిస్తాయి. వేసవి కాలంలో వట్టివేర్లను నీటిలో వేసుకుని ఆ నీటిని సేవించడం ద్వారా శరీర వేడిని దూరం చేస్తాయి.

వట్టివేర్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి వచ్చిన రసాన్ని వడకట్టి వేడిచేయాలి. బెల్లంపాకం పట్టి దాంట్లో ఈ రసం వేసి కలిపి చివరగా నిమ్మరసం పిండాలి. ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

వీటి నుంచి వచ్చే సువాసన మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. వేర్లలోని సుగంధతైలాలు రుచికరంగా ఉంటాయి. వట్టివేర్లను పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :